Saturday, 20 January 2018

వర్షించే మేఘంలా



                                        


వర్షించే మేఘంలా నేనున్నా
నీ ప్రేమే నాకొద్దని అన్నా         \\2\\


కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంటా
ఏనాడూ రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే
నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించకే
భామ భామ ప్రేమ గీమ వలదే    \\వర్షించే\\


నాటి వెన్నెల మల్లి రానే రాదు
మనసులో వ్యధ ఇంక అణగదు
వలపు దేవిని మరువగ తరమా
హా......ఆమని ఎరుగని శూన్యవనమిది
నీవే నేనని నువ్వు పలుకగా
కోటి పూవులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే
వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే
మరచిపోవే మనసా ...             \\వర్షించే\\


చేరుకొమ్మని చెలి పిలువగ
ఆశతో మది ఒక కల గని
నూరు జన్మల వరమై నిలిచే
 చెలీ...ఒంటరి భ్రమ కల చెదిరిన
ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కృంగవ చెలియా
ఒక నిమిషమైన నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురోహలనే
మరచిపోవే మనసా.....               


నా గతమంతా నే మరిచానే
నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించకే
భామ భామ ప్రేమ గీమ వలదే

0 comments:

Post a Comment