మనోహరా నా హృదయమునే ఓ మధువనిగా
మలిచినానంట రతీవర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట \\2\\
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల
జడి వానై ప్రియ నన్నే చేరుకోమ్మ
శ్రుతి మించుతోంది దాహం
ఒక పాన్పుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నో ఎన్నో కసి
ననుజయించుకుంటే నేస్తం
నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికి మాయదుగా
చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసి
చెలరేగిపోవాలీదేహం....
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా
మలిచినానంట సుధాకర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట.....ఓ ప్రేమ ప్రేమ
సందె వేళ స్నానం చేసి నన్ను చేరి
నా చీర కొంగుతో ఒళ్ళు
నువ్వు తుడుస్తావే అదో కావ్యం
దొంగ మల్లె ప్రియా ప్రియా సడే లేక
వెనకాల నుండి నన్ను
హత్తుకుంటావే మధు ఖాయం ....
నీ కోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా
ఓ సారి ప్రియమార ఒడి చేర్చుకోవా నీ చెలిని \\మనోహర\\
వర్షించే మేఘంలా నేనున్నా
నీ ప్రేమే నాకొద్దని అన్నా \\2\\
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంటా
ఏనాడూ రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే
నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించకే
భామ భామ ప్రేమ గీమ వలదే \\వర్షించే\\
నాటి వెన్నెల మల్లి రానే రాదు
మనసులో వ్యధ ఇంక అణగదు
వలపు దేవిని మరువగ తరమా
హా...ఆ...ఆమని ఎరుగని శూన్యవనమిది
నీవే నేనని నువ్వు పలుకగా
కోటి పూవులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే
వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే
మరచిపోవే మనసా ఆ... \\వర్షించే\\
చేరుకొమ్మని చెలి పిలువగ
ఆశతో మది ఒక కల గని
నూరు జన్మల వరమై నిలిచే
ఓ చెలీ...ఒంటరి భ్రమ కల చెదిరిన
ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కృంగవ చెలియా
ఒక నిమిషమైన నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురోహలనే
మరచిపోవే మనసా.....
నా గతమంతా నే మరిచానే
నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించకే
భామ భామ ప్రేమ గీమ వలదే