Sunday, 24 May 2015

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లె

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లె

ఎన్నో  ఎన్నో  వర్ణాల  హరివిల్లె చెలి కళ్ళయి మెరిసెలే
మబ్బుల్లోనే జబిల్లె నా చెలి నగుమోమై విరిసెలే
గుండెలు ప్రాణంగా నీవే నిండంగ, మండే ఎండల్లో వేసే చలి చలి
ప్రేమ రాగాలు ప్రణయ  కలహాలు, నాకు నీవే …. ,నీవే ...

వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
యెదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి , బంజర్లోను పూచేటి పూలన్నీ.. నీ.. హోయలే

ఎన్నో  ఎన్నో  వర్ణాల  హరివిల్లె చెలి కళ్ళయి మెరిసెలే
మబ్బుల్లోనే జబిల్లె నా చెలి నగుమోమై విరిసెలే

నీకోసమే ఎదనే గుడిలా  ఇలా మలిచె నా మనసే
నీ కానుకై నిలిచే తనువే …
నవరసమే నీవంట ,  పరవశమై జన్మంతా
పరిచయమే పండాలంట ,  ప్రేమే ఇంకా ఇంకా

మరి మరి నీ కవ్వింత , విరియగ నా వాళ్ళంతా
కలిగెనులే ఓ పులకింత… ఎంతో వింత
నువ్వువిన జగమున…. నిలుతున ప్రియతమ ….

వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
యెదలో సందళ్ళు ని అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి , బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హోయలే..

ఎన్నో  ఎన్నో  వర్ణాల  హరివిల్లె చెలి కళ్ళయి మెరిసెలే
మబ్బుల్లోనే జబిల్లె నా చెలి నగుమోమై విరిసెలే

గుండెలు ప్రాణంగా నీవే నిండంగ, మండే ఎండల్లో వేసే చలి చలి
ప్రేమ రాగాలు ప్రణయ  కలహాలు, నాకు నీవే …. ,నీవే

వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
యెదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి , బంజర్లోను పూచేటి పూలన్నీ.. నీ.. హోయలే..

0 comments:

Post a Comment