Monday, 5 August 2013

ప్రియతమా ఓ ప్రియతమా




                           

ప్రియతమా  ప్రియతమా    మౌనరాగాలనే  పలికే హృదయం  “2”

నిన్ను చూడాలని   మాట చెప్పాలని కలవరిస్తుందని తెలుసా... 

” ప్రియతమా”



ఎప్పుడో  అపుడెప్పుడో ముడి  పడినది  బందమేదో 

ఇప్పుడే  ఇప్పుడిప్పుడే నీ మనసుచెప్పింది  నాతో 

వాన విల్లు ఏదో మెరిసిందిలా  పూలజల్లు నాపై కురిసిందిల ...

రాగమో అనురాగమో    వింత మాయనేమంటారో   ” ప్రియతమా”



గుట్టుగా  కనిపెట్టగా  మనసంత నీ సంతకాలే 

మత్తుగా  గమ్మత్తు గా ఎదనిండ  నీ జ్ఞాపకాలే 

నిన్ను చూడకుండా  మనసుండదే  నిన్ను చూసినాక కునుకుండదే 

మోహమో వ్యామోహమో    వింత మాయనేమంటారో 

ప్రియతమా  ప్రియతమా    మౌనరాగాలనే  పలికే హృదయం 

నిన్ను చేరిందని తన మనసు విప్పిందని 

I LOVE U  అంటుందని  తెలుసా ..... “2”

0 comments:

Post a Comment