Thursday, 25 July 2013

ఈ తూరుపు ఆ పశ్చిమం



                                              

తూరుపు పశ్చిమం సంగమించిన శుభవేళ
పడమటి సంధ్యా రాగాలేవో పారాణి పూసెనులే...
You avakay me ice cream
This is the hot and sweet love's dream
United states of hearts we have
Like indian namaste

ఆకాశంలో తార సుడిగాలికారని దీపం
గుడి లేని దైవం కోసం ఒడి చేరుకున్నవిలే
సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం
అలిసేది కాదనురాగం జన్మ సంగీతం
గ్రహణాలు లేని తారలన్నీ
గగనాన కలిసే వేళలోనే
కలిసింది బంధం కలిసింది బంధం
తూరుపు పశ్చిమం సంగమించిన శుభవేళ
పడమటి సంధ్యా రాగాలేవో పారాణి పూసెనులే...

చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే
మనసైన పాటల కోసం మౌనాల ఆశలు పూసే
ఏడేడు రంగుల దీపం నింగిలో హరి చాపం
అరుణాల రుదిరంతోనే రుణమైనదీ ప్రియ బంధం
దేశమైనా ఆకాశమొకటే
జంటకైనా అనురాగమొకటే
అపురూపమీ ప్రణయం అపురూపమీ ప్రణయం
తూరుపు పశ్చిమం సంగమించిన శుభవేళ
పడమటి సంధ్యా రాగాలేవో పారాణి పూసెనులే...

You avakay me ice cream
This is the hot and sweet love's dream

0 comments:

Post a Comment