Tuesday, 23 July 2013

నెల్లూరి నెరజాణ



                                          

 నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెంట ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే

జొన్న కంకి ధూళె పడినట్టు కన్నులలో దూరి తొలచితివే
తీగ వదిలొచ్చిన మల్లికవే ఒక మారు నవ్వుతూ బదులీవే
పెదవిపై పెదవుంచి మాటలను జుర్రుకొని వేళ్ళతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది, నీ అందానికెదురేది నువ్వు తాకే చోట కైపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే

ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవె ఓ చెలియా
నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడ
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమింక మట్టిలో కలిసిపోయేవరకు ఓర్చునో
ప్రాణం నా చేంతనుండంగా నువు మరణించిపోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెంట ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకుంటా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

0 comments:

Post a Comment