ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా(2)
బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి
వాగల్లె నడిచావే
నీ బుట్టలోని పువ్వులన్నీ గుట్టులన్ని రట్టు చేసి
నన్నీడ నిలిపేనే
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
పల్లి పల్లి ముదినేపల్లి పల్లి పల్లి ముదినేపల్లి
కాటుక కళ్ళ వాడల్లో కట్టుకుంటా గుడిసంట
పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంట
చింతపల్లి చిన్నోణ్ణి చూడు నీకు వరసంట
వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంట
పగలు రేయి నీతో ఉంటా ఉన్నావంటే అది తప్పంటా
కలిసి వస్తే ఎన్నెల మాసం చెయ్యాలి జాగరం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా //2//
బుట్ట మీద బుట్ట పెట్టి
నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే వేస్తావే
తమలపాకు తడిలోన పండెనే నీ నోరంట
నోటి పంట కాదంట పాడిపంట చూడంట
నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట
ఆశ పడిన మావయ్యది అందమైన మనసంట
అందం చందం నీకే సొంతం
వెన్నెలలోనే ఏసా మంచం
పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి
నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే వేస్తావే
0 comments:
Post a comment