సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత బడుగు పేద
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నోకలల కల నేత
నా వన్నెల రాశికి సిరి జోత \\2\\
ముచ్చట గొలిపే మొగలి పొద్దుకు
ముళ్ళు వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు
అలక కులుకు ఒక అందం
ఈ అందాలన్నీ కలబోసా
నీ కొంగుకు చెంగున ముడి వేస్తా \\2\\
ఇది ఎన్నోకలల కల నేత
నా వన్నెల రాశికి సిరి జోత \\2\\
చుర చుర చూపులు ఒక మారు
నీ చిరు చిరు నవ్వులు ఒక మారు
మూతి విరుపులు ఒక మారు
నువ్వు ముద్దుకు సిద్దం ఒక మారు
నువ్వు ఏ కలనున్నా మా బాగే
ఈ చీర విశేషం అల్లాగే \\2lines 2\\
సరికొత్త చీర ఊహించినాను
సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత బడుగు పేద
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నోకలల కల నేత
నా వన్నెల రాశికి సిరి జోత \\2\\
0 comments:
Post a comment