Wednesday, 5 June 2013

నువ్వే నువ్వే

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచే ఈ గానం
ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా
కనుల్లోన నీరూపం వెలుగుతుండగా
మనస్సంతా మల్లెల జలపాతం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచే ఈ గానం

తరుముతు వచ్చే తీయని భావం
ప్రేమో ఏమో ఎలాచెప్పడం
తహ తహ పెంచే తుంటరి దాహం
తప్పో ఒప్పో ఏం చెయ్యడం
ఊహల్లో ఊయలూపే సంతోషం రేగేలా
ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా
అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచే ఈ గానం

ఎవరెవరంటూ ఎగిసిన ప్రాయం
నిన్నే చూసి తలొంచే క్షణం
నిగనిగమంటూ నీ నయగారం
హారం వేసి వరించే క్షణం
స్నేహాల సంకెళ్ళే అల్లేసే కౌగిల్లో
పారాణి పాదాలె పారాడే గుండెల్లో
నడకే మరిచీ శిలయ్యింది కాలం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచే ఈ గానం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచే ఈ గానం

0 comments:

Post a Comment