Friday, 7 June 2013

పరువం వానగా





                                                

 పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే  ll 2 ll

 
నదివే నీవైతే అల నేనే....
ఒక పాటా నీవైతే నీరాగం నేనే...


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె


నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగులలో తేలనీ నీ గుండెలో నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ



పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే  



 పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె


 నీ గారాల చూపులే నాలో రేపెను మొహం
నీ మందార నవ్వులే నాకే వేసెను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో నీ పరువాలు
పలికించుకో

 పరువం వానగా నేడు కురిసేనులే
 ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే 
 

నదివే నీవైతే అల నేనే....
ఒక పాటా నీవైతే నీరాగం నేనే...


  పరువం వానగా నేడు కురిసేనులే
 ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె ll2ll

0 comments:

Post a Comment