Wednesday, 5 June 2013

తరలిరాద

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
గగనాల దాక అలసాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం

వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందును కాదా
ప్రతి మదినిలేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కదా
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం

బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయ లేదా
బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయ లేదా
కళకైన కలకైన జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
గగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం

0 comments:

Post a Comment