Wednesday, 5 June 2013

చెప్పవే చిరుగాలి

చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి
ఎక్కడే వసంతాల కేళి .. చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి .. చూపవే నీతో తీసుకెళ్ళి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి
ఎక్కడే వసంతాల కేళి .. చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి .. చూపవే నీతో తీసుకెళ్ళి

ఆశా దీపికలై మెరిసే తారకలు
చూసే దీపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో.. అడుగే అలై పొంగుతుంది
...చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ
రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవా షికార్లు
కురిసే సుగంధాల హోళి .. చూపదా వసంతాల కేళి
కురిసే సుగంధాల హోళి .. చూపదా వసంతాల కేళి

చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి

యమునా తీరాల కథ వినిపించేలా
రాధామాధవుల జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో వేళ చెవిలో సన్నయి రాగంలా
...కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల
రాతిరి ఏదని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లసంగా తుళ్ళి హో.. చూపదా వసంతాల కేళి
ఊపిరే ఉల్లసంగా తుళ్ళి హో.. చూపదా వసంతాల కేళి

చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి
ఎక్కడే వసంతాల కేళి .. చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి .. చూపవే నీతో తీసుకెళ్ళి

0 comments:

Post a Comment