Wednesday, 5 June 2013

నమ్మకు నమ్మకు

చీకటమ్మ చీకటి ముచ్చటైన చీకటి
వెచ్చనైన ఊసులన్ని రెచ్చ గొట్టు చీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి
ముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటి
పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిదరోనీ
రాయే రాయే రామ సిలక సద్దుకుపోయే చీకటెనక

నమ్మకు నమ్మకు రేయిని కమ్ముకు వచ్చిన మాయని
నమ్మకు నమ్మకు రేయిని అరె కమ్ముకు వచ్చిన మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు రేయిని అరే కమ్ముకు వచ్చిన మాయని

వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్ని
నమ్మకు నమ్మకు అరె నువ్వు నమ్మకు నమ్మకు రేయిని
అరె కమ్ముకు వచ్చిన మాయని

ఆకాశం తాకే మేడకైన ఆధారం లేదా నేలలో
ఆకాశం తాకే మేడకైన ఆధారం లేదా నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
ఏహాయి రాదోయి నీవైపు నడువకు

నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు అహా నమ్మకు నమ్మకు రేయిని
అరె కమ్ముకు వచ్చిన మాయని

శీతాకాలంలో కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
ఆనాడు వసంత గీతాలు పలుకును కద
గసమ గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని
సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ

నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు అహా నమ్మకు నమ్మకు రేయిని
అహ కమ్ముకు వచ్చిన మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు రేయిని అరె కమ్ముకు వచ్చిన మాయని

0 comments:

Post a Comment