Wednesday, 5 June 2013

అందాలలో అహో మహోదయం

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం

లతా లతా సరాగమాడె సుహాసిని సుమాలతో
వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో
మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా
తళా తళా గళాన తటిల్లతా హారాలుగా
చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం

సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా
సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా
విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా
గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే
కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే
ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

0 comments:

Post a Comment