Sunday, 16 June 2013

రాసలీలవేళ


                                     

                                            రాసలీలవేళ రాయభారమేల మాటే మౌనమై మాయ చేయనేల
రాసలీలవేళ రాయభారమేల మాటే మౌనమై మాయ చేయనేల

కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల
మోజులన్ని పాడగా జాజిపూల జావళి
కందెనేమో కౌగిట అందమైన జాబిలి
తేనెవానలోన చిలికె తీయనైన స్నేహము
మేని వీణలోన పలికె సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోన సొదలుమాని        \\రాసలీల\\
మాయచేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని హాయిపూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువసోకు కలువరేకు చలువసోకి నిలువనీదు          \\రాసలీల\\

1 comment: