నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో..
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో..
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే..
నువ్వేనా ప్రాణమే.. \\నా ఇంటి\\
నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట..
మనసార చేరే వేళ మౌనాలే తగదంట..
సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట..
వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట..
ఆషాఢం పోయిందో గోదారి పొంగెనో..
వైశాఖం వచ్చిందో అందాలే పూచేనో..
ఈడే సద్దు చెసెనో..
నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో..
నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే..
నేనే నీ ప్రాణమే.. \\నీ ఇంటి\\
గుండెల్లో ఒక ఊహ ఉయ్యాల ఊగింది..
మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది..
ఊహలకే మాటొస్తే హృదయాలే కలిసేను..
చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను..
ఎనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి..
కలలన్ని పండించే ముద్దుల్లో తేలాలి..
మ్ హుమ్ మ్..పరవశమే.. \\నా ఇంటి\\ \\నీ ఇంటి\\
0 comments:
Post a comment