VELUGU NEEDALU
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా... ఆ...
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా... ఆ...
పాడవోయి భారతీయుడా
నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం ఓ...
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా... ఆ...
పాడవోయి భారతీయుడా
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా... ఆ...
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా... ఆ...
ఆగకోయి భారతీయుడా
ఆకాశం అందుకొనే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
ఆకాశం అందుకొనే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు
అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితీ...
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితీ...
కాంచవోయి నేటి దుస్థితి
పదవీ వ్యామోహాలు కులమత భేదాలు
భాషా ద్వేషాలు చెలరేగే నేడు
పదవీ వ్యామోహాలు కులమత భేదాలు
భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషీ మరియొకని దోచుకొనే వాడే
ప్రతి మనిషీ మరియొకని దోచుకొనే వాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే
స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుటె క్షేమదాయకం
స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుటె క్షేమదాయకం
స్వార్థమే అనర్థ కారణం
సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే
లోకానికి మన భారతదేశం అందిచునులే శుభసందేశం
లోకానికి మన భారతదేశం అందిచునులే శుభసందేశం
లోకానికి మన భారతదేశం అందిచునులే శుభసందేశం
లోకానికి మన భారతదేశం అందిచునులే శుభసందేశం
0 comments:
Post a comment