Wednesday, 27 February 2013

వయ్యారాల





                                          

వయ్యారాల జాబిల్లి వోణీ కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి
నదివలె కదిలా నిలబడకా కలలను వదిలా నిను వెతకా
వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే
అడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే
వయ్యారాల జాబిల్లి వోణీ కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే
నా ఎద గుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే
అణువణువు చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు
ఇది వరకు గుండె లయకు తెలియదులే ఇంత పరుగు
వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే
వయ్యారాల జాబిల్లి వోణీ కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ ప్రతి తలపు నాకొక గెలుపై శుభాలు తొణికెనులే
నీ శ్రుతి తెలిపే కోయిల పిలుపే తథాస్తు పలికెనులే
గగనములా మెరిసి మెరిసి పవనములా మురిసి మురిసి
నిను కలిసే క్షణము తలచి అలుపు అనే పదము మరచి
వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే

0 comments:

Post a Comment