Wednesday, 27 February 2013

SWATHI MUTYAM

SWATHI MUTYAM

                                            
                               

మనసు పలికే (మనసు పలికే)
మౌన గీతం (మౌన గీతం)
మనసు పలికే మౌన గీతం నే..డే..
మమతలొలికే (మమతలొలికే)
స్వాతి ముత్యం (స్వాతి ముత్యం)
మమతలొలికే స్వాతి ముత్యం నీ..వే..
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమ ధనువు ఉ.....
మనసు పలికే మౌన గీతం నే..డే..
మమతలొలికే స్వాతి ముత్యం నీ..వే..

శిరసుపైనే గంగనై మరుల జలకాలాడనీ (మరుల జలకాలాడనీ)
సగము మేనా గిరిజనై పగలు రేయి ఒదగనీ (పగలు రేయి ఒదగనీ)
హృదయ మేళనలో... మధుర లాలనలో...
హృదయ మేళనలో... మధుర లాలనలో...
వెలిగి పోనీ రాగ దీపం
వెలిగి పోనీ రాగ దీపం వేయి జన్మలుగా....
మనసు పలికే మౌన గీతం (నే..డే..)
మమతలొలికే స్వాతి ముత్యం (నీ..వే..)

కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ (ఓనమాలు దిద్దనీ)
పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దనీ (మొదటి తీపి)
లలిత యామినిలో... కలల కౌముదిలో...
లలిత యామినిలో... కలల కౌముదిలో...
కరిగి పోనీ కాలమంతా
కరిగి పోనీ కాలమంతా కౌగిలింతలుగా....
మనసు పలికే (మనసు పలికే )
మౌన గీతం (మౌన గీతం)
మనసు పలికే మౌన గీతం (నే..డే..)
మమతలొలికే (మమతలొలికే)
స్వాతి ముత్యం (స్వాతి ముత్యం)
మమతలొలికే స్వాతి ముత్యం (నీ..వే..)
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమ ధనువు

0 comments:

Post a Comment