Wednesday, 27 February 2013

SEETA RAMAYYA GARI MANAMARALU

SEETA RAMAYYA GARI MANAMARALU
                     
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ దాని సన్నాయి జళ్లోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై .. జతులాడ
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ దాని సన్నాయి జళ్లోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీకంటి పాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయు లీనమై
పా..డే మది పా..డే
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ దాని సన్నాయి జళ్లోన సంపెంగ

పట్టుకుంది నాపదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి భేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూల తోటలై
పసి మొగ్గరేకులే పరువాల చూపులై
పూ.. సే విరబూ..సే
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ దాని సన్నాయి జళ్లోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
.. జతులా..
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ దాని సన్నాయి జళ్లోన సంపెంగ

0 comments:

Post a Comment