Wednesday, 27 February 2013

SANTOSHAM

SANTOSHAM


                                               

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా  
మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా


ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా
 నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా  
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా  
ఎక్కడ వాలను చెప్పు నువ్వే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా  
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కదా తడబడనీయకు కదిలిన కథ
 వెతికే మనసుకు మమతే పంచుమా
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా  
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా  
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా
 నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా  
తియ్యని రుచిగల కటిక విషం నువ్వే సుమా  
పెదవులపై చిరునవ్వుల రథ కనపడనీయవు నిప్పుల సెగ  
నీటికి ఆరని మంటల రూపమా  

నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
 నీ బాటేమిటో జంటకి చూపవు కదా  
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
తేరులో ప్రణయమా తీరులో ప్రళయమా అందవా బంధమా

  నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా  
నీ బాటేమిటో జంటకి చూపవు కదా

0 comments:

Post a Comment