Wednesday, 27 February 2013

SAMBARAM

SAMBARAM

ఎందుకే ఇలా... గుండె లోపలా... ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా... అల్లుకోకిలా.... ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానియ్యవా దయలేని స్నేహమా...

ఎందుకే ఇలా... గుండె లోపలా... ఇంత మంట రేపుతావు అందని కలా...
అన్ని వైపులా... అల్లుకోకిలా.... ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

తప్పదని నిను తప్పుకొని వెతకాలి కొత్త దారి
నిప్పులతో మది నింపుకొని బతకాలి బాటసారి
జంటగా చితి మంటగా గతమంత వెంట ఉందిగా...
ఒంటిగా నను ఎన్నడు వదిలుండనందిగా
నువ్వు నీ చిరు నవ్వు చేరని చోటే కావాలి
ఉందో లేదో లోకంలో నీకే తెలియాలి
ఎందుకే ఇలా... గుండె లోపలా... ఇంత మంట రేపుతావు అందని కలా...
అన్ని వైపులా... అల్లుకోకిలా.... ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

ఆపకిలా ఆనాటి కలా అడుగడుగు తూలిపోదా
రేపకిలా కన్నీటి అలా వెలుగు చూడనీక
జన్మలో నువు లేవని ఇకనైన నన్ను నమ్మనీ
నిన్నలో వదిలేయనీ ఇన్నాళ్ళ ఆశనీ
చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా
నన్నే నేను వెలివేసుకుని దూరం ఔతున్నా
ఎందుకే ఇలా... గుండె లోపలా... ఇంత మంట రేపుతావు అందని కలా...
అన్ని వైపులా... అల్లుకోకిలా.... ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

0 comments:

Post a Comment