Wednesday, 27 February 2013

SAGARASANGAMAM

SAGARASANGAMAM

                                           

 ఓం... నమఃశివాయా... ఓం నమఃశివాయా...  
చంద్రకళాధర సహృదయా... చంద్రకళాధర సహృదయా...  
సాంద్రకళా పూర్ణోదయ లయనిలయా... 
ఓం... ఓం... నమఃశివాయా... ఓం... నమఃశివాయా...

పంచభూతములు ముఖ పంచకమై 
 ఆరు ఋతువులు ఆహార్యములై 
పంచభూతములు ముఖ పంచకమై 
ఆరు ఋతువులు ఆహార్యములై  
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై
 నీ దృక్కులే అటు అష్టదిక్కులై  
నీ వాక్కులే నవరసమ్ములై తాపస మందారా... ......
 నీ మౌనమే  
దశోపనిషత్తులై ఇల వెలయా..  
ఓం... ఓం... ఓం... నమఃశివాయా...

 త్రికాలములు నీ నేత్రత్రయమై 
చతుర్వేదములు ప్రాకారములై
  త్రికాలములు నీ నేత్రత్రయమై
  చతుర్వేదములు ప్రాకారములై 
 గజముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ సంకల్పానికి ఋగ్విజవరులై  
అద్వైతమే నీ ఆది యోగమై
 నీ లయలే కాల గమనమై 
కైలాస గిరివాస నీ గానమే
జంత్రగాత్రముల శృతి కలయా..  

ఓం... ఓం... ఓం... నమఃశివాయా...  
చంద్రకళాధర సహృదయా...  
సాంద్రకళా పూర్ణోదయ లయనిలయా...

0 comments:

Post a Comment