Wednesday, 27 February 2013

PREMALEKHA

PREMA LEKHA

                                             

ప్రియా నిను చూడలేకా... ఊహలో నీ రూపురాకా...
నీ తలపుతోనే... నే బతుకుతున్నా... ...

నీ తలపుతోనే... నే బతుకుతున్నా
ప్రియా నిను చూడలేకా... ఊహలో నీ రూపురా..కా...

వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
ఉదయించే సూర్యుడిని నేనడిగాను నీ కుశలం
అనుక్షణం నా మనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలలో నీ కథలే
కనులకు నిదురలే కరువాయే
ప్రియా నిను చూడలేకా... ఊహలో నీ రూపురా..కా...

కోవెలలో కోరితిని నీ దరికి నను జేర్చమని
దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
లేఖతో ముద్దయిన అందించరాదా
నినుగాక నీ కలని పెదవంటుకోదా
వలపులు నీ దరి చేరుటెలా
ఊహల పడవలే చేర్చునులే
ప్రియా నిను చూడలేకా... ఊహలో నీ రూపురాకా...
నీ తలపుతోనే... నే బతుకుతున్నా... ...
నీ తలపుతోనే... నే బతుకుతున్నా
ప్రియా నిను చూడలేకా... ఊహలో నీ రూపురా..కా...

0 comments:

Post a Comment