Wednesday, 27 February 2013

PREMA

PREMA

 

                                            

 ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసినా త్యాగమా
ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా

శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు కడతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులి వెచ్చనైన ఓదార్పు నీవై
శృతి లయ లాగా జత చేరినావు
నువు లేని నన్ను ఊహించలేను
నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమా...
ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా

నీ పెదవి పైనా వెలుగారనీకు
నీ కనులలోనా తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు
కారుమబ్బు ఎటు కమ్ముకున్నా
మహాసాగరాలే నిను మింగుతున్నా
జన్మలోనా ఎడబాటు లేదు
పది జన్మలైనా ముడే వీడి పోదు
అమరం అఖిలం మన ప్రేమా...
ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసినా త్యాగమా
ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా
ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా

0 comments:

Post a Comment