Wednesday, 27 February 2013

Mr.Perfect-చలి చలిగా అల్లింది

Mr.perfect

                                            

.. చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసు

చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి
నువ్వు నాతోనె ఉన్నట్టు నానీడ వైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు
చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసు

గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీది నాది
తలపులు వేరైనా కలవని తీరైనా బలపడి పోతుందే ఉండేకొద్ది
లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు
తారలన్ని తారసపడినట్టు అనిపిస్తుందే నాకు ఏమైనట్టు
నువ్వు నాతోనె ఉన్నట్టు నానీడ వైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురే లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను
నాకు నేనే దూరం ఔతున్నా నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే
నువ్వు నాతోనె ఉన్నట్టు నానీడ వైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

0 comments:

Post a Comment