Wednesday, 27 February 2013

MATHRUDEVO BHAVA-వేణువై వచ్చాను

MATHRU DEVO BHAVA

                       

                                       


వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
మమతలన్ని మౌనగానం వాంఛలన్ని వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
మాతృదేవోభవ (మాతృదేవోభవ)
పితృదేవోభవ (పితృదేవోభవ)
ఆచార్యదేవోభవ (ఆచార్యదేవోభవ)

ఏడు కొండలకైన బండ తానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడు కొండలకైన బండ తానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలత లో వెలుగునే కనక
నేను మేననుకుంటే ఎద చీకటే
హరీ..... హరీ..... హరీ.........
రాయినై ఉన్నాను ఈ నాటికీ... రామ పాదము రాక ఏ నాటికీ..
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె నిప్పు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు పుట్టిల్లు చేరె మట్టి ప్రాణాలు
హరీ......... హరీ......... హరీ.........
రెప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి
గాలినై పోయాను గగనా...నికి

0 comments:

Post a Comment