Wednesday, 27 February 2013

MATHRUDEVO BHAVA-రాలిపోయె పువ్వా

MATHRUDEVO BHAVA

                                            


రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే... తోటమాలి నీ.. తోడు లేడులే...
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో... చీకటాయెలే...
నీకిది తెలవారని రేయమ్మా.... ఆ....
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం
రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే... తోటమాలి నీ.. తోడు లేడులే...
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో... చీకటాయెలే...

చెదిరింది నీ గూడు గాలిగా చిలకా గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా....
తనవాడు తారల్లొ చేరగా మనసు మాంగళ్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా....
తిరిగే భూమాతవు నీవై... వేకువలో... వెన్నెలవై..
కరిగే కర్పూరము నీవై... ఆశలకే... హారతివై..
రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే... తోటమాలి నీ.. తోడు లేడులే...
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో... చీకటాయెలే...

అనుబంధమంటేనె అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే.... ఆ....
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలె కొండెక్కి పోయే....
పగిలే ఆకాశము నీవై... జారిపడే... జాబిలివై..
మిగిలే ఆలాపన నీవై... తీగ తెగే... వీణియవై..
రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే... తోటమాలి నీ.. తోడు లేడులే...
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో... చీకటాయెలే...

0 comments:

Post a Comment