MANCHI KUTUMBAM
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం
వేణుమాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం
కమ్మని నగుమోము కాంచుటె తొలి నోము
కడగంటి చూపైన కడ పావనం
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం
రాధను ఒకవంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే
రాధను ఒకవంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే
మనసార నెరనమ్ము తనవారినీ.... ఆ..........
మనసార నెరనమ్ము తనవారినీ
కోటి మరులందు సుధలందు తనియించునే...
మనసే అందాల బృందావనం
బృందావనం. బృందావనం. ఆ.......
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం
0 comments:
Post a Comment