MAHANADI
గంగాశంకాశ కావేరి శ్రీరంగేశ మనోహరి
కళ్యాణకారి కలుశాని నమస్తేస్తు శుభాచరి
ఆ....... ఆ........
శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటిముత్యాలు క్రిష్ణవేణిలో అలలగీతాలు
నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా
క్రిష్ణవేణిలో అలలగీతాలు క్రిష్ణగీతలే పాడగా
శ్రీరంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
క్రిష్ణా తీరాన అమరావతిలో
శిల్పకళావాణి పలికిన శృతిలో
అలలై పొంగేను జీవన గీతం
కలలే పలికించు మధు సంగీతం
చల్లగా గాలి పల్లకీలోన పాట ఊరేగగా
వెల్లువై గుండె పల్లె పదమల్లి పల్లవే పాడగా
శ్రీత్యాగరాజకీర్తనై సాగె తియ్యనీ జీవితం
శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా
క్రిష్ణవేణిలో అలలగీతాలు క్రిష్ణగీతలే పాడగా
శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
గంగను మరపించు ఈ క్రిష్ణవేణి
వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి
పాపాల హరియించు పావన జలము
పచ్చగ ఈ నేల పండించు ఫలము
ఈ యేటి నీటి పాయలే తేటగీతులే పాడగా
సిరులెన్నొ పండి ఈ భువి స్వర్గలోకమై మారగా
కల్లకపటమే కానరాని ఈ పల్లెసీమలో
శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా
క్రిష్ణవేణిలో అలలగీతాలు క్రిష్ణగీతలే పాడగా
శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే
శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
0 comments:
Post a comment