Wednesday, 27 February 2013

KANNE VAYASU

KANNE VAYASU




                                          

దివిలో విరిసిన పారిజాతమో
కవిలో మెరిసిన ప్రేమ గీతమో

నా మదిలో నీవై నిండి పోయెనే.......
దివిలో విరిసిన పారిజాతమో
కవిలో మెరిసిన ప్రేమ గీతమో

నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతినింపెనే.....
దివిలో విరిసిన పారిజాతమో
కవిలో మెరిసిన ప్రేమ గీతమో

పాల బుగ్గలను లేత సిగ్గులు అల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రా...వే
దివిలో విరిసిన పారిజాతమో
కవిలో మెరిసిన ప్రేమ గీతమో

నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్య కన్యవై రా...వే
దివిలో విరిసిన పారిజాతమో
కవిలో మెరిసిన ప్రేమ గీతమో

0 comments:

Post a Comment