HAPPY DAYS
పాదమెటు పోతున్నా పయనమెందాకైనా
అడుగు తడబడుతున్నా తోడురానా
చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోనా నేను లేనా
ఒంటరైనా ఓటమైనా... వెంట నడిచే నీడ వేనా...
ఓ..... మై ఫ్రెండ్.... తడి కన్నులనే తుడుచిన నేస్తమా....
ఓ..... మై ఫ్రెండ్.... ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా
అమ్మ ఒడిలో.... లేని పాశం.... నేస్తమల్లే.... అల్లుకుందీ....
జన్మకంతా.... తీరిపోనీ.... మమతలెన్నో.... పంచుతోందీ....
మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే....
మోమాటాలే లేనీ... కళే జాలువారే....
ఒంటరైనా ఓటమైనా... వెంట నడిచే నీడ నీవే...
ఓ..... మై ఫ్రెండ్.... తడి కన్నులనే తుడుచిన నేస్తమా....
ఓ..... మై ఫ్రెండ్.... ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా
వాన వస్తే.... కాగితాలే.... పడవలయ్యే.... జ్ఞాపకాలే....
నిన్ను చూస్తే.... చిన్ననాటి చేతలన్నీ.... చెంతవాలే....
గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం....
మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే....
ఒంటరైనా ఓటమైనా... వెంట నడిచే నీడ నీవే...
ఓ..... మై ఫ్రెండ్.... తడి కన్నులనే తుడుచిన నేస్తమా....
ఓ..... మై ఫ్రెండ్.... ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా
0 comments:
Post a comment