Wednesday, 27 February 2013

GUNDAMMA KATHA

GUNDAMMA KATHA



                                           

మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే


కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే.. ....
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మైమరచితిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే

ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే ....
ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే
రుస రుస లాడుతు విసిరిన వాల్ జడ వలపు పాశమని బెదిరితిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే

0 comments:

Post a Comment