Wednesday, 27 February 2013

GHARSHANA-నిన్ను కోరీ వర్ణం వర్ణం

GHARSHANA


                                            

నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం

ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలి మది విరిసేనే
రవి కుల రఘు రామ అనుదినము
నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం

ఉడికించే చిలకమ్మ నిన్నూరించే
ఒలికించే అందాలే ఆలాపించే
ముత్యాలా బంధాలే నీకందించే
అచ్చట్లు ముచ్చట్లు తానాసించే
మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది
కలలే విందు చేసెనే నీతో పొందు కోరెనే
ఉండాలనీ నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు
నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలి మది విరిసేనే
రవి కుల రఘు రామ అనుదినము
నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం

వీణా మీటేది నీవేనంట
నా తలపు నా వలపు నీదేనంట
పరువాల పరదాలు తీసే పూట
కలవాలి కరగాలి నీలోనంట
పలికించాలి స్వాగతం పండించాలి జీవితం
నీకు నాకు క్షణం కానీ రాగ సంగమం
నీ జ్ఞాపకం నాలోన సాగేనులే వేళ సరసకు
నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలి మది విరిసేనే
రవి కుల రఘు రామ అనుదినము
నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం


0 comments:

Post a Comment