Wednesday, 27 February 2013

GAYAM

GAYAM



                                           

అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

మెలికలు తిరిగే.. నది నడకలకు
మరి మరి ఉరికే.. మది తలపులకు
లలలలల లా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

నాకోసమే... చినుకై కరిగి ఆకాశమే... దిగదా ఇలకు
నాసేవకై... సిరులే చిలికి దాసోహమే... అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా... నా ఊహలకు
కలలను తేవా... నా కన్నులకు
లలలలల లా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

నీ చూపులే... తడిపే వరకు ఏమైనదో... నాలో వయసు
నీఊపిరే... తగిలే వరకు ఎటూ ఉన్నదో... మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే... తరుణం కొరకు
ఎదురుగ నడిచే... తొలి ఆశలకు
లలలలల లా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే.. నది నడకలకు
మరి మరి ఉరికే.. మది తలపులకు
లలలలల లా

0 comments:

Post a Comment