Wednesday, 27 February 2013

GARSHANA-ఒక బృందావనం

GHARSHANA

                                          

ఒక బృందావనం... సోయగం...
ఎద కోలాహలం... క్షణక్షణం...

ఒకే స్వరం సాగేను తియ్యగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం... సోయగం...

నే సందెవేళ జాబిలీ...
నా గీతమాల ఆమనీ...
నా పలుకు తేనె కవితలే...
నా కులుకు చిలక పలుకులే...
నే కన్న కలల మేడ నందనం...
నాలోని వయసు ముగ్ధ మోహనం...
ఒకే స్వరం సాగేను తియ్యగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం... సోయగం...

నే మనసు పడిన వెంటనే...
ఇంద్రధనుసు పొందునే...
వెండి మేఘ మాలనే...
నా పట్టు పరుపు చేయనే...
నే సాగు బాట జాజి పూవులే...
నాకింక సాటి పోటి లేదులే...
ఒకే స్వరం సాగేను తియ్యగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం... సోయగం...
ఒకే స్వరం సాగేను తియ్యగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం... సోయగం...

0 comments:

Post a Comment