EEGA
కొంచెము అర్థమయ్యినా కొంచెము కొంచెము కాకపోయినా
కొంచెము బెట్టు చూపినా కొంచెము కొంచెము గుట్టు విప్పినా
కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా...
ఒఒఓ.... నీ గుండె లోతున భూతద్దమెయ్యనా
ఏదో మూలన నన్నే చూడనా
నీ గుండె లోతున భూతద్దమెయ్యనా
ఏదో మూలన నన్నే చూడనా
కొంచెము చూడవచ్చుగా కొంతైనా మాట్లాడవచ్చుగా
పోనీ అలగ వచ్చుగా పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్ల మెల్లగా పిచ్చోణ్ణవుతున్నా జాలి పడవుగా...
ఒఒఓ.... పిసినారి నారివే పిసరంత పలకవే
ఆ కంచె తెంచవే ఇవాళైనా
పిసినారి నారివే పిసరంత పలకవే
ఆ కంచె తెంచవే ఇవాళైనా
కాకితొ కబురు పంపినా కాదనకుండా వచ్చి వాలనా
రెక్కలు లేకపోయినా చుక్కలకే నిను తీసుకెళ్ళనా
జన్మలు ఎన్ని మారినా ప్రతి జన్మలొ జంటగ నిన్ను చేరనా...
ఒఒఓ.... నీ గుండె గూటిలో నా గుండె హాయిగా
తల దాచుకుందని తెలియలేదా
what did you say ?
నీ గుండె గూటిలో నా గుండె హాయిగా
తల దాచుకుందని తెలియలేదా
0 comments:
Post a Comment