Wednesday, 27 February 2013

ARYA-2 కరిగే లోగా ఈ క్షణం

ARYA-2 (కరిగే లోగా క్షణం )


                                            

కరిగే లోగా క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సా..క్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చే..రగా

గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం గమ్యమై
గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా
కరిగే లోగా క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సా..క్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చే..రగా...

పరుగులు తీస్తూ.. అలసిన నది నేను ఇరు తీరాల్లో.. దేనికి చేరువ కాను
నిదురను దాటీ.. నడిచిన కల నేను ఇరు కన్నుల్లో.. దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా.. ... నా సగమేదో ప్రశ్నగ మారిందా... ...
నేడీ బంధానికి పేరుందా... ... ఉంటే విడదీసే వీలుందా... .... హో..
కరిగే లోగా క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సా..క్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చే..రగా...

అడిగినవన్నీ.. కాదని పంచిస్తూనే మరు నిమిషంలో.. అలిగే పసివాడివిలే
నీ పెదవులపై.. వాడని నవ్వుల పువ్వే నువు పెంచావా.. నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే.. ... నా బాధంతటి అందంగా ఉందే... .. హో..
క్షణమే నూరేళ్ళౌతానంటే... .... మరు జన్మే క్షణమైనా చాలంతే... ..
కరిగే లోగా క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సా..క్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చే..రగా...
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం గమ్యమై
గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా

0 comments:

Post a Comment