Wednesday, 27 February 2013

ARYA-2 ఉప్పెనంత ఈ ప్రేమకీ

ARYA-2(ఉప్పెనంత ప్రేమకీ)


                                             

ఉప్పెనంత ప్రేమకీ... గుప్పెడంత గుండె ఏమిటో...
చెప్పలేని హాయికీ... భాషే ఎందుకో...

తియ్యనైన బాధకీ... ఉప్పు నీరు కంట దేనికో...
రెప్పపాటు దూరానికే... విరహం ఎందుకో...
నిన్ను చూసె కళ్ళకీ... లోకమంత ఇంక ఎందుకో...
రెండు అక్షరాల ప్రేమకీ... ఇన్నీ శిక్షలెందుకో...
లవ్ యూ... నా ఊపిరి ఆగిపోయినా... లవ్ యూ... నా ప్రాణం పోయినా...
లవ్ యూ... నా ఊపిరి ఆగిపోయినా... లవ్ యూ... నా ప్రాణం పోయినా...
ఉప్పెనంత ప్రేమకీ... గుప్పెడంత గుండె ఏమిటో...
చెప్పలేని హాయికీ... భాషే ఎందుకో...

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు సెకనుకోసారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంటపడి నా మనసు మసి చేస్తావు
తీసుకుంటె నువ్వు ఊపిరీ... పోసుకుంట ఆయువే చెలీ...
గుచ్చుకోకు ముల్లులా మరీ... గుండెల్లో సరాసరీ....
లవ్ యూ... నా ఊపిరి ఆగిపోయినా... లవ్ యూ... నా ప్రాణం పోయినా...
లవ్ యూ... నా ఊపిరి ఆగిపోయినా... లవ్ యూ... నా ప్రాణం పోయినా...
ఉప్పెనంత ప్రేమకీ... గుప్పెడంత గుండె ఏమిటో...
చెప్పలేని హాయికీ... భాషే ఎందుకో...

చినుకులే నినుతాకి మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే తొలకరే లేకుండా పాతెయ్యనా..
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే..
నిన్ను చూస్తె ఉన్న చోటనే తోడేస్త కళ్ళనే....
లవ్ యూ... నా ఊపిరి ఆగిపోయినా... లవ్ యూ... నా ప్రాణం పోయినా...
లవ్ యూ... నా ఊపిరి ఆగిపోయినా... లవ్ యూ... నా ప్రాణం పోయినా...
ఉప్పెనంత ప్రేమకీ... గుప్పెడంత గుండె ఏమిటో...
చెప్పలేని హాయికీ... భాషే ఎందుకో...

0 comments:

Post a Comment