Wednesday, 27 February 2013

ANANDAM-కనులు తెరిచినా కనులు మూసినా

ANANDAM-కనులు తెరిచినా కనులు మూసినా



                                              


కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా


ఎదుటే ఎపుడూ తిరిగే... వెలుగా  
ఇదిగో ఇపుడే చూశా... సరిగా 
 ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోనా 
 ఐతే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా 
 కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా 
 నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా

పెదవుల్లో దరహాసం నీకోసం పూసింది 
 నీ జతలో సంతోషం పంచాలనిపిస్తుంది 
 ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది 
 ఐతేనే అలజడిలో ఒక ఆనందం ఉంది 
 దూరం మహ చెడ్డదని లోకం అనుకుంటుంది 
 కానీ దూరమె నిన్ను దగ్గర చేసింది 
 నీలో నా ప్రాణం ఉందని ఇపుడే...గా తెలిసింది 
 నీతోఅది చెప్పిందా నీ జ్ఞాపకాలె నా ఊపిరైనవని 

 కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా 
 నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా

ప్రతి నిమషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది 
 ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
 నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది 
 నాక్కూడా కలవరమిపుడే పరిచయమయ్యింది  
అద్దంలో నా బదులు అరె నువ్వే... కనిపించావే  
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే  
ప్రేమా కొత్త స్వరం అని అనుమా...నం కలిగింది  
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మరి

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా  
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా
ఎదుటే ఎపుడూ తిరిగే... వెలుగా 
 ఇదిగో ఇపుడే చూశా... సరిగా  
ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోనా 
 ఐతే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా

0 comments:

Post a Comment