Wednesday, 27 February 2013

ఉరకలై గోదావరీ








                                              

ఉరకలై గోదావరీ.. ఉరికె నా ఒడి లోనికీ...
సొగసులై బృందావనీ... విరిసె నా సిగ లోనికీ...
జత వెతుకు హృదయానికీ... శృతి తెలిపె మురళీ...
చిగురాకు చరణాలకీ... సిరిమువ్వ రవళీ... రసమయమ్..... జగతి
ఉరకలై గోదావరీ.. ఉరికె నా ఒడి లోనికీ...

నీ ప్రణయ భావం నా జీవ రాగం
నీ ప్రణయ భావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి
అనురాగ రాగంలో స్వరలోకమే మనదైనది
ఉరకలై గోదావరీ.. ఉరికె నా ఒడి లోనికీ...
జత వెతుకు హృదయానికీ... శృతి తెలిపె మురళీ...
చిగురాకు చరణాలకీ... సిరిమువ్వ రవళీ... రసమయమ్..... జగతి

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈనాడు నాదైనది
ఒక గుండె అభిలాష పదిమందికి బ్రతుకైనది
ఉరకలై గోదావరీ.. ఉరికె నా ఒడి లోనికీ...
సొగసులై బృందావనీ... విరిసె నా సిగ లోనికీ...
జత వెతుకు హృదయానికీ... శృతి తెలిపె మురళీ...
చిగురాకు చరణాలకీ... సిరిమువ్వ రవళీ... రసమయమ్..... జగతి

0 comments:

Post a Comment