Wednesday, 27 February 2013

HAPPY DAYS

HAPPY DAYS

                                            

పాదమెటు పోతున్నా పయనమెందాకైనా
అడుగు తడబడుతున్నా తోడురానా
చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోనా నేను లేనా
ఒంటరైనా ఓటమైనా... వెంట నడిచే నీడ వేనా...
..... మై ఫ్రెండ్.... తడి కన్నులనే తుడుచిన నేస్తమా....
..... మై ఫ్రెండ్.... ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా

SWATHI MUTYAM

SWATHI MUTYAM

                                            
                               

మనసు పలికే (మనసు పలికే)
మౌన గీతం (మౌన గీతం)
మనసు పలికే మౌన గీతం నే..డే..
మమతలొలికే (మమతలొలికే)
స్వాతి ముత్యం (స్వాతి ముత్యం)
మమతలొలికే స్వాతి ముత్యం నీ..వే..
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమ ధనువు ఉ.....
మనసు పలికే మౌన గీతం నే..డే..
మమతలొలికే స్వాతి ముత్యం నీ..వే..

శిరసుపైనే గంగనై మరుల జలకాలాడనీ (మరుల జలకాలాడనీ)
సగము మేనా గిరిజనై పగలు రేయి ఒదగనీ (పగలు రేయి ఒదగనీ)
హృదయ మేళనలో... మధుర లాలనలో...
హృదయ మేళనలో... మధుర లాలనలో...
వెలిగి పోనీ రాగ దీపం
వెలిగి పోనీ రాగ దీపం వేయి జన్మలుగా....
మనసు పలికే మౌన గీతం (నే..డే..)
మమతలొలికే స్వాతి ముత్యం (నీ..వే..)

కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ (ఓనమాలు దిద్దనీ)
పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దనీ (మొదటి తీపి)
లలిత యామినిలో... కలల కౌముదిలో...
లలిత యామినిలో... కలల కౌముదిలో...
కరిగి పోనీ కాలమంతా
కరిగి పోనీ కాలమంతా కౌగిలింతలుగా....
మనసు పలికే (మనసు పలికే )
మౌన గీతం (మౌన గీతం)
మనసు పలికే మౌన గీతం (నే..డే..)
మమతలొలికే (మమతలొలికే)
స్వాతి ముత్యం (స్వాతి ముత్యం)
మమతలొలికే స్వాతి ముత్యం (నీ..వే..)
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమ ధనువు

SEETA RAMAYYA GARI MANAMARALU

SEETA RAMAYYA GARI MANAMARALU
                     

                                    

పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ దాని సన్నాయి జళ్లోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై .. జతులాడ
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ దాని సన్నాయి జళ్లోన సంపెంగ

SIRIVENNELA

SIRIVENNELA
  
                                           
 

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ....మ్.......
ప్రాణనాధులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓ....మ్.......
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం...... ఆ......
సరసస్వర సుర ఝరీగమనమౌ సామ వేద సారమిది
సరసస్వర సుర ఝరీగమనమౌ సామ వేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ... గీ...తం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఘ తంతుల పైనా
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైనా
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఘ తంతుల పైనా
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైనా
పలికిన కిలకిల ధ్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాదా
విశ్వకార్యమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వర సుర ఝరీగమనమౌ సామ వేద సారమిది
నే పాడిన జీవన గీతం ... గీ...తం

SAGARASANGAMAM

SAGARASANGAMAM

                                           

 ఓం... నమఃశివాయా... ఓం నమఃశివాయా...  
చంద్రకళాధర సహృదయా... చంద్రకళాధర సహృదయా...  
సాంద్రకళా పూర్ణోదయ లయనిలయా... 
ఓం... ఓం... నమఃశివాయా... ఓం... నమఃశివాయా...

పంచభూతములు ముఖ పంచకమై 
 ఆరు ఋతువులు ఆహార్యములై 
పంచభూతములు ముఖ పంచకమై 
ఆరు ఋతువులు ఆహార్యములై  
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై
 నీ దృక్కులే అటు అష్టదిక్కులై  
నీ వాక్కులే నవరసమ్ములై తాపస మందారా... ......
 నీ మౌనమే  
దశోపనిషత్తులై ఇల వెలయా..  
ఓం... ఓం... ఓం... నమఃశివాయా...

 త్రికాలములు నీ నేత్రత్రయమై 
చతుర్వేదములు ప్రాకారములై
  త్రికాలములు నీ నేత్రత్రయమై
  చతుర్వేదములు ప్రాకారములై 
 గజముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ సంకల్పానికి ఋగ్విజవరులై  
అద్వైతమే నీ ఆది యోగమై
 నీ లయలే కాల గమనమై 
కైలాస గిరివాస నీ గానమే
జంత్రగాత్రముల శృతి కలయా..  

ఓం... ఓం... ఓం... నమఃశివాయా...  
చంద్రకళాధర సహృదయా...  
సాంద్రకళా పూర్ణోదయ లయనిలయా...

SAMBARAM

SAMBARAM

ఎందుకే ఇలా... గుండె లోపలా... ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా... అల్లుకోకిలా.... ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానియ్యవా దయలేని స్నేహమా...

SANTOSHAM

SANTOSHAM


                                               

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా  
మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా

SUBHASANKALPAM

SUBHASANKALPAM

                                        

 సీతమ్మ అందాలూ.... రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలూ... సీతమ్మ సూత్రాలు
సీతమ్మ అందాలూ.... రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలూ... సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే.... ఎన్ని ఆత్రాలు
ఏకమవ్వాలంటే.... ఎన్ని ఆత్రాలు
ఏకమైన చోట వేద మంత్రాలు
ఏకమైనచోట వేద మంత్రాలు
కంచి మేసిన చేనూ... కామాక్షిదైతే
చేనుకేలే చింత చెప్పవే చెలియా
కాశి దోచిన దొంగా... ఈశుడే ఐతే
గంగకేలే బెంగ తెలుపవె సఖియా....
సీతమ్మ అందాలూ.... రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలూ... సీతమ్మ.

VELUGU NEEDALU

VELUGU NEEDALU

                                           
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా... ...
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా... ...
పాడవోయి భారతీయుడా
నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం ...
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా... ...
పాడవోయి భారతీయుడా

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా... ...
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా... ...
ఆగకోయి భారతీయుడా

ఆకాశం అందుకొనే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
ఆకాశం అందుకొనే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు
అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి పరిస్థితీ...
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి పరిస్థితీ...
కాంచవోయి నేటి దుస్థితి

పదవీ వ్యామోహాలు కులమత భేదాలు
భాషా ద్వేషాలు చెలరేగే నేడు
పదవీ వ్యామోహాలు కులమత భేదాలు
భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషీ మరియొకని దోచుకొనే వాడే
ప్రతి మనిషీ మరియొకని దోచుకొనే వాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే
స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుటె క్షేమదాయకం
స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుటె క్షేమదాయకం
స్వార్థమే అనర్థ కారణం

సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే
లోకానికి మన భారతదేశం అందిచునులే శుభసందేశం
లోకానికి మన భారతదేశం అందిచునులే శుభసందేశం
లోకానికి మన భారతదేశం అందిచునులే శుభసందేశం
లోకానికి మన భారతదేశం అందిచునులే శుభసందేశం

VAANA

VAANA

                                              

ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా..
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా...
ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా..

VARSHAM

VARSHAM

                                             

మెల్లగా తరగనీ.. రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ.. కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే.. పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే.. అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా.....
వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
వర్షం సాక్షిగా కలపనీ బంధం
మెల్లగా తరగనీ.. రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ.. కొంటె తలపుల ద్వారం

నీ మెలికలలోనా.. మెరుపులు చూస్తున్నా
తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా
ఉరుములలోనా.. నీ పిలుపును వింటున్నా
చిటపటలో చిటికెల తాళం నీదేనా
మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా
జత పడే స్నేహమై అనునయించనా...
చలి పిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా
వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
వర్షం సాక్షిగా కలపనీ బంధం

తెరమరుగైనా.. చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
చిరు చినుకైనా.. నీ సిరులను చూపేనా
వరుణునికే ఋణపడిపోనా పైనా
త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
విడుదలే వద్దనే ముడులు వేయనా....
మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా
వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
వర్షం సాక్షిగా కలపనీ బంధం
మెల్లగా తరగనీ.. రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ.. కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే.. పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే.. అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా.....
వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
వర్షం సాక్షిగా కలపనీ బంధం

LEADER

LEADER


                                             

శ్రీలు పొంగిన జీవ గడ్డై పాలు పారిన భాగ్య సీమై
శ్రీలు పొంగిన జీవ గడ్డై పాలు పారిన భాగ్య సీమై
రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా
రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా
శ్రీలు పొంగిన జీవ గడ్డై పాలు పారిన భాగ్య సీమై

YAMUDU

YAMUDU
                                 

నా హృదయం ఎరుగదు ఇదివరకు ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు కసి గుసగుసలే

ఇది ఏదో ఏమో ఎరుగనులే ఐనా మధురములే
ఇది కలయా నిజమా తెలియదులే
కొంచెం కలయై కొంచెం నిజమై ఊయలూపె ఎదనే
నా హృదయం ఎరుగదు ఇదివరకు ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు కసి గుసగుసలే
--ఎక్కడో నువ్వున్నా పక్కనే ఉన్నట్టుందీ...
ఎప్పుడూ నిన్నొదిలి మనసిలా రానంటుందీ...
ఎందుకో ప్రతి మాటా నీ పేరులా వినబడుతోందీ...
అందుకే సగ వాటా నీ పేరులో మనసడిగిందీ...
దాహమే రేపినా మోహమే నీవులే
తియ్యనీ వీణలా గుండెల్లొ మోగావులే
నా హృదయం ( హృదయం హృదయం........)
నా హృదయం ఎరుగదు ఇదివరకు ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు కసి గుసగుసలే
--- యవ్వనం నీకోసం నేర్చెలే వయ్యారాలు (వయ్యారాలు)
క్షణం నా ప్రాయం పేర్చెలే పూబాణాలు
కంటిలో కాటుకలా కరిగినా నా స్వప్నాలే...
గంటకో కోరికలా చేరనీ నీ కౌగిళ్ళే...
బొత్తిగా మరచినా పడకలో నిద్దురా
ముద్దుకే మనసిలా పడుతోందిలే తొందరా
నా హృదయం నా హృదయం
నా హృదయం ఎరుగదు ఇదివరకు ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు కసి గుసగుసలే
గుసగుసలే గుసగుసలే గుసగుసలే గుసగుసలే
గుసగుసలే గుసగుసలే గుసగుసలే గుసగుసలే

Mr.Perfect-చలి చలిగా అల్లింది

Mr.perfect

                                            

.. చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసు